ఎమోషనల్ అయిన మహేష్, త్రివిక్రమ్
మహేష్ బాబు ఎంతగానో వెయిట్ చేసిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో అట్టహాసంగా జరిగింది. గుంటూరులో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం అక్కడ జరిగిన గొడవలు, తొక్కిసలాటతో పాటూ సినిమాకు సంబంధించిన ఇద్దరు కీలక వ్యక్తులు ఎమోషనల్ గా కనిపించడం.
ఆ ఇద్దరు మరెవరో కాదు, హీరో మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్. మహేష్ ఎప్పుడూ లేనంతగా ఈ సినిమా ఈవెంట్ లో ఎమోషనల్ అవ్వకపోవడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. మహేష్ ను ఇంతటి వాడిని చేసిన తన తల్లిదండ్రులిద్దరూ సంవత్సరం గ్యాప్ లోనే చనిపోవడం, తన సోదరుడు రమేష్‌ను కూడా మహేష్ కోల్పోవడమే దానికి రీజన్. అందుకే మహేష్ ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతూ, ఇకపై తన ఫ్యాన్సే తనకు అమ్మ నాన్న అని చెప్పేశాడు.
ఇక ఇదే ఈవెంట్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఎమోషనల్ అయాడు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ కు సంబంధించిన ఏవీని ప్లే చేయగా, అది చూస్తూ తన జర్నీని గుర్తు చేసుకున్నాడో ఏమో కానీ, ఎప్పుడూ లేని విధంగా త్రివిక్రమ్ రెస్పాండ్ అయ్యి, ఆ వీడియో చూస్తు కళ్లలో నీళ్లు పెట్టుకున్నాడు. కళ్లలో నీళ్లు పెట్టుకోవడమంటే ఏడ్చేయడం కాదు కానీ త్రివిక్రమ్ కళ్లలో నీళ్లను మాత్రం అందరూ గమనించారు. తర్వాత స్టేజ్ పైకి వచ్చాక కూడా త్రివిక్రమ్ ఎమోషనల్ గానే కనిపించాడు.













