మహేష్ నిర్మాతగా కొత్త సినిమా… మరి హీరో?
ఈమధ్య మహేష్ హీరోగా నటించే సినిమాలకు మహేష్ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జిఎంబి ఎంటర్టైన్మెంట్ అనే బేనర్ ద్వారా చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టాడు మహేష్. ఇప్పడు తను హీరోగా నటించే సినిమాలే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే అడివి శేష్ హీరోగా నటిస్తున్న `మేజర్` చిత్రాన్ని తన సొంత బేనర్లో నిర్మిస్తున్నాడు. అడివి శేష్‌తో `గూఢచారి` చిత్రాన్ని రూపొందించిన శశికిరణ్ తిక్క `మేజర్` చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా శేష్ సరసన శోభిత ధూళిపాళ హీరోయిన్గా నటిస్తోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం స్పూర్తిగా ఈ సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉంటే ఇప్పడు మహేష్‌బాబు మరో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నారని సమాచారం.
లాక్డౌన్ కారణంగా కొత్త తరహా కథలు వినేందుకు మహేష్‌కు మంచి సమయం చిక్కింది. ఈమధ్యకాలంలో ఎన్నో కథలు విన్న మహేష్‌కి ఒక కథ బాగా నచ్చిందట. ఈ కథను ఎవరితో చేస్తే బాగుంటుందన్న డిస్కషన్లో శర్వానంద్ పేరు వినిపించిందట. శర్వానంద్‌కి ఈ కథ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని ఒక అంచనాకి వచ్చారు మహేష్. ఆ దిశగా ఈ ప్రాజెక్ట్‌కి ఒక షేప్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా శర్వానంద్‌కి ఈ కథ చెప్పడం, అతను ఓకే అనడం కూడా జరగాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.













