మహేష్‌బాబు జోడీగా సారా అలీఖాన్!
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాలో శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ని ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో మరో న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మహేష్‌బాబు, పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో తొలుత కైరా అద్వానీ పేరు వినిపించినప్పటికీ ఫైనల్‌గా సైఫ్ అలీఖాన్ తనయ, బాలీవుడ్ కథానాయిక సారా అలీఖాన్ని ఎంపిక చేసినట్టు సమాచారం. వీరిద్దరి జోడి ఫ్రెష్‌గా ఉండటమే కాకుండా టాలీవుడ్ సిల్వర్స్క్రీస్ మీద కచ్చితంగా మ్యాజిక్ చేస్తారనే నమ్మకంతో చిత్ర బృందం ఉందట. ఏదిఏమైనా అటు ఎన్టీఆర్, ఇటు మహేష్‌బాబు ఇద్దరు తన నయా చిత్రాల్లో నయా జోడితో కనిపించబోతున్నారన్నమాట.













