త్వరలో అమెరికాకు మహర్షి
డబ్బుని మనసుతో ముడిపెట్టిన వాడు మనిషి. మనసుని తపస్సుతో జయించేవాడు మహర్షి. అలాంటి ఓ యువకుడి కథే మహర్షి. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. పూజా హేగ్డే కథానాయిక. అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వంశీపైడిపల్లి దర్శకుడు. అశ్వనీదత్, దిల్‌రాజు నిర్మాతలు. త్వరలో అమెరికా వెళ్లబోతోంది మహర్షి బృందం. అక్కడ పదిహేను రోజుల పాటు కీలక సన్నివేశాలతో పాటు పాటల్ని తెరకెక్కిస్తారు. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటుంది. ఇటీవల హైదరాబాద్, డెహ్రాడూన్లలో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.













