అమెరికాకు వెళ్తున్న మహర్షి
సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే మహేష్‌బాబు షూటింగ్‌కు కాస్త గ్యాప్ దొరికితే, ఆటవిడుపుగా కుటుంబంతో కలిసి విదేశాల వంటి సుదూర ప్రాంతాలను చుట్టి రావడం చూస్తున్నదే. ప్రస్తుతం తన 25వ చిత్రం మహర్షి చిత్రంతో ఆయన బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొత్త షెడ్యూల్‌కు మధ్యలో చిన్న గ్యాప్ రాగానే ఆయన కుటుంబంతో సరదాగా థాయ్‌లాండ్ వెళ్లినట్లు సమాచారం. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్టోబర్‌లో మహర్షి భారీ షెడ్యూల్ కోసం అమెరికాలో జరగనున్నట్లు తెలిసింది. అంతకుమందు తొలి షెడ్యూల్‌ను డెహ్రాడూన్‌లోనూ, మలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరిపారు. అందులో భాగంగా కీలక సన్నివేశాల చిత్రీకరించారు.
రైతు నేపథ్య కథా వస్తువుతో సాగే ఈ చిత్రంలో మహేష్ కాలేజీ విద్యార్థిగా కనిపిస్తారని అంటున్నారు. రిషి పాత్రలో నటిసుత్న్న ఆయన లుక్ మీసకట్టుతో చాలా కొత్తగా ఉంటుందన్న విషయం ఇప్పటికే సృష్టమైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంటేశ్వరర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.













