మరోసారి తన లుక్‌ను మార్చుకుంటున్న మహేష్.. ‘సర్కారువారి పాట’లో సూపర్‌స్టార్ డూయల్ రోల్?
మహేష్ హీరోగా పరిచయమైన రాజకుమారుడు నుంచి తీసుకుంటే ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ఒకే లుక్‌లో కనిపిస్తాడు. అత్యవసరం అయితే తప్ప తన లుక్‌ని మార్చుకునే ప్రయత్నం చేయడు. రెగ్యులర్‌గా తన లుక్‌కి భిన్నంగా కనిపించిన సినిమాలు కొన్నే ఉన్నాయి. వాటిలో నిజం, పోకిరి, అతిథి వంటి సినిమాలు చెప్పుకోవచ్చు. నిజం సినిమాలో ఒక నార్మల్ పర్సన్‌గా బొట్టు పెట్టుకొని కళ్ళజోడుతో కనిపిస్తాడు. పోకిరిలో కాస్త డిఫరెంట్‌గా హెయిర్ స్టైల్ మార్చి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అతిథి చిత్రంలో ఏ సినిమాలోనూ కనిపించనంత హెయిర్‌తో కనిపిస్తాడు. ఆ తర్వాత చేసిన సినిమాల్లో మహర్షి కోసం కొంతభాగం గడ్డం, మీసాలతో కనిపించాడు. తాజాగా పరశురామ్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న `సర్కారువారి పాట` కోసం మరోసారి తన లుక్‌ని మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఆ లుక్ ఏ విధంగా ఉంటుందనేది త్వరలోనే తెలుస్తుంది.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌ను పక్కాగా పూర్తచేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. ఇప్పట్లో థియేటర్లకు అనుమతి ఇచ్చే అవకాశం లేనప్పటికీ సినిమాను కంప్లీట్ చెయ్యాలని భావిస్తున్నాడు పరశురామ్. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అయితే ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడ చేస్తారు, ఎన్నిరోజులు చేస్తారు అనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తారు. కథ విషయానికి వస్తే… బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవినీతిని ప్రధానం ఈ సినిమా చర్చించబోతున్నారు. ఇండియాలో జరిగిన భారీ కుంభకోణాల చుట్టూ కథ తిరుగుతుంది. ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకైన హీరో వేలాది కోట్లు ఎగవేసిన ఓ బడా బిజినెస్‌మేన్ నుంచి ఆ డబ్బును రాబట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు… అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందట.
ఈ సినిమాకి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఒకటి బయటికి వచ్చింది. అదేమిటంటే ఇందులో మహేష్ రెండు పాత్రలు పోషిస్తున్నాడట. ఒకటి బ్యాంక్ మేనేజర్ కొడుకు. అయితే మరో క్యారెక్టర్ ఏమిటి, కథలో ఆ క్యారెక్టర్‌కి వున్న ఇంపార్టెన్స్ ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే వార్తలో ఎంత నిజముందనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక చక్కని మెసేజ్‌ను అందించడంతోపాటు ఎంటర్టైన్మెంట్ పాలు కూడా ఎక్కువగా వుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు పరశురామ్. అలాగే రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో మొదట కియారా అద్వానీ హీరోయిన్ అనుకున్నారు. బాలీవుడ్లో ఆమెకు ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆ అవకాశం కీర్తి సురేష్‌ను వరించింది.













