18 ఏళ్ళ ప్రేమ..! నేడు మహేష్, నమ్రత ల పెళ్లి రోజు..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత పెయిర్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరంలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఈ జంట ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. వంశీ సినిమాలో కలిసి జోడిగా నటించిన మహేష్, నమ్రత ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి ఒకటయ్యారు. అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా 2005 ఫిబ్రవరి 10న వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకి దూరమై ఫ్యామిలీలైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.
సరిగ్గా ఈరోజుకి మహేష్ నమ్రత తమ 18 ఏళ్ళ వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ 18 ఏళ్ళ ప్రేమకి గుర్తుగా గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ సితార సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక సాధారణంగా సోషల్ మీడియాలో అంత ఆక్టివ్ గా ఉందని మహేష్ బాబు, తన పెళ్లి రోజు సందర్భంగా నమ్రతని విష్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ మెసేజ్ ని పోస్ట్ చేసారు. ” 18 ఇయర్స్ ఆఫ్ టుగెథెర్ అండ్ ఫర్ ఎవర్ గో.. హ్యాపీ యానివెర్సరీ ” అంటూ చాలా క్యూట్ గా నమ్రతకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు మహేష్ బాబు.
నమ్రత శిరోద్కర్ కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా స్వీట్ నోట్ ని షేర్ చేసుకుంది. ” సెలబ్రేటింగ్ 18 ఇయర్స్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ వి ఎవర్ మేడ్. హ్యాపీ యానివెర్సరీ MB “. అంటూ తన ప్రేమని సోషల్ మీడియా ద్వారా తెలిపింది నమ్రత. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఈ జంట సక్సెఫుల్ అయి మహేష్, నమ్రత అభిమానులకి కనువిందు చేస్తున్నారు. ఫాన్స్, ఆడియన్స్ సైతం ఈ ఆడోరబుల్ కపుల్ కి విషెస్ తెలియచేస్తున్నారు. మహేష్, నమ్రత లైఫ్ లాంగ్ ఇలానే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాం.













