జక్కన్న సినిమాకు ముందు మహేష్ ప్రయోగం
గత కొంత కాలంగా ఏడాదికి ఒక సినిమా చొప్పున రిలీజ్ చేస్తూ వస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఒక్కోసారి ఆ యేడాది కంటే కూడా ఎక్కువే టైమ్ పడుతుంది. యావరేజ్ గా ఇయర్ కి ఒక్కటి చొప్పున సినిమాలు చేసుకుంటూ వస్తున్న మహేష్ తన తర్వాతి సినిమా విషయంలో మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.
పరశురామ్ డైరక్షన్ లో ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేష్ ఆ తర్వాత చేయబోతున్న సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి హల్ చల్ చేస్తుంది. రాజమౌళితో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ దాని కంటే ముందుకు ఒక చిన్న సినిమా చేయాలని మహేష్ భావిస్తున్నాడని, దానికోసం అనీల్ రావిపూడి స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నట్లు వార్తొచ్చాయి.
కానీ మహేష్ తన తర్వాతి సినిమాను అనీల్ రావిపూడితో కాకుండా మరో కొత్త డైరక్టర్ తో చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఆ కొత్త డైరక్టర్ కు మహేష్ జస్ట్ రెండు నెలల టైమ్ మాత్రమే ఇచ్చాడట. అంతే కాదు బడ్జెట్ కూడా చాలా తక్కువలో చెప్పాడట. ఈ మధ్య కాలంలో మహేష్ సినిమా బడ్జెట్ తో కంపేర్ చేస్తే ఆ కొత్త డైరక్టర్ తో చేసే సినిమా బడ్జెట్ దాదాపుగా సగం తక్కువంటున్నారు. స్క్రిప్ట్ నచ్చడంతోనే మహేష్ ఈ ప్రయోగానికి ఒప్పుకున్నాడని, రెండు నెలల్లోనే సినిమాను ఫినిష్ చేసి వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేయాలని.. ఆ తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేయాలని మహేష్ ఆలోచిస్తున్నాడట. రాజమౌళితో సినిమాకు ముందు రిజల్ట్ ఎలా ఉన్నా అది కెరీర్ మీద పెద్దగా ప్రభావం చూపదు కాబట్టే మహేష్ ఈ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తుంది.













