ఇకపై నాన్ స్టాప్ గా గుంటూరు కారం
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే మహేష్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుంది? సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అవదా అనే అనుమానాలు ఫ్యాన్స్ ను తెగ వెంటాడుతున్నాయి. రీసెంట్గా బర్త్ డే సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన మహేష్ ఈ సినిమా షెడ్యూల్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 16 నుంచి ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ మొదలుకానుందని సమాచారం. 20వ తేదీ నుంచి మహేష్ షూట్ లో పాల్గొననున్నాడట. దాదాపు రెండు నెలల పాటూ సాగే ఈ లాంగ్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే ప్లాన్ చేస్తున్నారు.
ఈ షెడ్యూల్లో మహేష్ పై యాక్షన్ సీక్వెన్స్‌తో పాటూ పలు కీలక సీన్స్ ను కూడా చిత్రీకరించనున్నాడట త్రివిక్రమ్. ఇప్పటివరకు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న ఈ సినిమా షూటింగ్ ఇకపై మాత్రం ఎలాంటి గ్యాప్స్ లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తన్నారట మేకర్స్. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైమ్ కు రెడీ చేయాలని త్రివిక్రమ్ ఫీలవుతున్నాడట. పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ మాస్ గెటప్ లో సరికొత్తగా కనిపించనున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నీ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.













