Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంటి?
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) డబ్బింగ్ చెప్పాడనే రీజన్ తో హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్(Mufasa Lion King) ను ఆయన్ ఫ్యాన్స్ ఎంతో ఓన్ చేసుకుని ఆదరించారు. రిలీజ్ డే రోజు బెంగుళూరు తో పాటూ తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ థియేటర్ల దగ్గర పెద్ద పెద్ద కటవుట్లు పెట్టి మరీ సెలబ్రేట్ చేశారు. ఈ సినిమా కు యూఎస్ లో కూడా తెలుగు షోలు యాడ్ చేసేలా డిస్నీ డెసిషన్ తీసుకుందంటే దాని ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
రాజమౌళితో తమ హీరో చేయబోయే సినిమా ఎలాగూ లేటవుతుందని తెలిసి మహేష్ ను ఇలా చూసుకుని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయితే ఇక్కడితో కథ అవలేదు. న్యూ ఇయర్ సందర్భంగా గుంటూరు కారం(Gunturu Karam) సినిమాను ఈ నెల 31ని రీరిలీజ్ చేయాలని డిసైడయ్యారు. ఏడాది కాకుండానే డివైడ్ టాక్ తో అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయిన ఈ సినిమాను ఆడియన్స్ ఎగబడి చూస్తారా అనే డౌట్ డిస్ట్రిబ్యూటర్లలో ఉంది.
కానీ దాన్ని బ్రేక్ చేస్తూ హైదరాబాద్ లో వేసిన రెండు షోలు కేవలం క్షణాల వ్యవధిలో అమ్ముడుపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు సుదర్శన్ తో పాటూ దేవి థియేటర్లో కూడా షోలు వేస్తున్నారు. మెల్లిగా మిగిలిన ఏరియాల నుంచి కూడా ఎంక్వరీయిలు మొదలయ్యాయి. మొత్తానికి నమ్మలేనంత నెంబర్లో షో లు కూడా పడే ఛాన్సుంది. ఇదంతా చూసి మహేష్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారేంటయ్యా అనిపించక మానదు.













