గుంటూరు కారం మళ్లీ మొదలవబోతుంది
సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి గుంటూరు కారంకు ఏదొక రూపంలో అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ రీసెంట్గా ఆగిపోయిన గుంటూరు కారం షూటింగ్ ఇప్పుడు మళ్లీ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. మహేష్ త్వరలోనే ఫారిన్ టూర్ ముగించుకుని తిరిగి రానున్నాడని తెలుస్తోంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలకు స్పెషల్ ఫ్యాన్స్ ఉండటమే దీనికి కారణం. కేవలం ఈ సినిమా డిజిటల్ రైట్స్‌కే రూ.80 కోట్లు ముట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ఓ పక్క క్రేజ్ వస్తున్నప్పటికీ, మరోవైపు నుంచి ఏదో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.
రీసెంట్‌గానే ఈ సినిమా నుంచి పిఎస్ వినోద్ కూడా తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే షూటింగ్ ఆగిపోయింది. దీంతో అసలు ఈ సినిమా పూర్తవుతుందా అని ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. తాజా సమాచారం ప్రకారం గుంటూరు కారం మళ్లీ షూటింగ్‌ను ప్రారంభించుకోనుందని తెలుస్తోంది. ఈ నెల 16న మహేష్ ఇండియాకు తిరిగిరానున్నాడని, 20వ తేదీ నుంచి షూటింగ్ పాల్గొననున్నట్లు సమాచారం అందుతుంది. ఈలోగా సినిమాటోగ్రాఫర్‌ని ఫిక్స్ చేసి 11 లేదా 12 నుంచి మహేష్ లేని ఎపిసోడ్లను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. మరి ఏం జరుగుతుందో చూడాలి.













