గుంటూరు కారం వేగం పెంచాల్సిందే..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ జరుగుతుంది. ఇప్పటికే ఆరు నెలల అయిపోయాయి. సినిమా ఇంకా 78 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందట.
మరో వైపు సినిమాను జనవరి13, 2024న రిలీజ్ చేస్తున్నామని టీజర్ తో పాటూ అనౌన్స్ చేసేశారు. ఇక పోస్ట్ పోన్ చేయడానికి కుదరదు. రిలీజ్ డేట్ విషయంలో నిర్మాత నాగ వంశీ చెప్పిన డేట్ కే రిలీజ్ చేయాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. కానీ సమ్మర్‌కు ముందు ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తర్వాతి షెడ్యూల్ కోసం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.
అందరూ టాప్ కాస్టింగ్ కావడమే ఇందుకు కారణం. హీరో అందుబాటులో ఉన్నా మిగిలిన వారితో ఉన్న కాంబినేషన్ షూట్ కోసం వాళ్లని చూసుకోవడం చాలా అవసరం. సినిమాలో ఉన్న ప్రకాశ్ రాజ్, రమ్య కృష్ణ, జయరాం, సునీల్, జగపతి బాబు వీళ్లంతా చాలా బిజీ ఆర్టిస్టులు. వీరందరి డేట్లు ఒకేసారి దొరకాలంటే చాలా కష్టం.
ఈ పరిణామలన్నింటినీ చూసి సినిమా చెప్పిన టైమ్ కు వస్తుందా లేదా అని పలువురు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. కానీ నిర్మాతలు మాత్రం గోల్డెన్ ఛాన్స్ అయిన సంక్రాంతిని మిస్ చేసుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. షూటింగే చాలా రోజులు పెండింగ్ ఉంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ అని, ప్రమోషన్స్ అని చెప్పుకుంటూ పోతే గుంటూరు కారానికి చాలా తక్కువ టైమే ఉంది. కాబట్టి చెప్పిన టైమ్ కు సినిమా రిలీజ్ కావాలంటే షూటింగ్ ను ఫాస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.













