మహాప్రస్థానం ఫస్ట్ లుక్ విడుదల
తనీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మహాప్రస్థానం. ముస్కాన్ సేథీ నాయికగా నటిస్తోంది. భానుశ్రీ మెహ్రా, రిషిక ఖన్నా, రాజా రవీంద్ర, కబీర్ దుహాన్ సింగ్, టార్జాన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద జర్నీ ఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్ ట్యాగ్‌లైన్‌తో యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జాని. ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న మహాప్రస్థానం సినిమాలో వేసవిలో విడుదల సిద్ధమవుతోంది. చిత్ర ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదట చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోసర్ట్లను విడుదల చేశారు. గుండె కన్నీరైతే, ఆవేశం ఆయుధమైతే ఆ కత్తి రాసే రుధిర కావ్యమే ఈ మహాప్రస్థానం అంటూ సాగిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు జాని మాట్లాడుతూ ఒక క్రిమినల్ ఎమోషనల్ జర్నీ ఇది. తనీష్ పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. తీవ్రత తో సాగే పాత్రలో ఆయన బాగా నటించారు. సినిమా కథ, దాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందిస్తుంది గెరిల్లా పద్ధతిలో అతి తక్కువ సమయంలో నాణ్యమైన చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పుడు అంతే వేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సెన్సాప్ పూర్తి చేసి వేసవిలో మహాప్రస్థానం చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తాం అన్నారు.













