మాధురి మనుసు తెలుగుపై మళ్లిందా?
మాధురి దీక్షిత్‌ను తెలుగులో తీసుకురావాలని ఇంతకు ముందు కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ పలు రకాల కారణాల వల్ల అవేవీ కార్యరూపం దాల్చలేదు. తెలుగు సినిమాలకు హిందీలో పెద్దగా మార్కెట్ లేనప్పుడే ఇందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించిన తెలుగు దర్శకనిర్మాతలు.. తెలుగు సినిమాలకు బాలీవుడ్ బ్రహ్మారధం పడుతున్న తరుణంలో ఈ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఓ ప్రముఖ యువ కథానాయకుడు నటించే భారీ బడ్జెట్ చిత్రంలో అత్త పాత్రకు మాధురి దీక్షిత్‌ను సంప్రదించారని, ఇందుకు ఆమె కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. తెలుగులో కూడా హిందీ రేంజల్లో రెమ్యూనరేషన్స్ ఇస్తున్నారు కాబట్టి… రెమ్యూనరేషన్స్ ఎంతమాత్రం ప్లాబ్లమ్ కాదు. ఇక కంటెంట్ విషయానికొస్తే ఆ విషయంలో బాలీవుడ్‌కి మన టాలీవుడ్ తీసిపోవడం లేదు. కాబట్టి ఒక్క తెలుగు సినిమాలోనూ నటించినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన మాధురి త్వరలోనే తెలుగులో నేరుగా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.













