Mad Boys: సౌత్ హీరోయిన్ల పేర్లు చెప్తే థంబ్ నైల్స్ అయిపోతాం
మ్యాడ్(MAD) మూవీతో తెలుగు ఆడియన్స్ ను అలరించిన ముగ్గురు యంగ్ హీరోలు నార్నె నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan), రామ్ నితిన్(Ram Nithin) ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్(Mad Square) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానుంది. కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ(Suryadevara naga vamsi) నిర్మించాడు.
ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మొత్తం సరదాగా ఓ చిట్ చాట్ లో పాల్గొని కబుర్లు చెప్పుకున్నారు. అందులో భాగంగానే డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ సినిమాలో నటించిన బాయ్స్ ను కొన్ని ప్రశ్నలడిగాడు. మ్యాడ్ తర్వాత మీరందరూ హీరోలయ్యారు కదా, తర్వాత మీరు చేయబోయే సినిమాలు ఏ హీరోయిన్ తో చేయాలనుకుంటున్నారు అని అడిగాడు.
దానికి రామ్ నితిన్ తనకు ఆలియా భట్(Alia Bhatt) అంటే ఇష్టమని చెప్పగా, లడ్డు మామ కన్నీ కసూడితి(Cunny kasudithi) అన్నాడు. డైరెక్టర్ కళ్యాణ్ దీపికా పదుకొణె(Deepika Padukone) పేరు చెప్పగా, సంగీత్ శోభన్ తనకు ఎవరి పేరూ గుర్తు రావడం లేదన్నాడు. వెంటనే డైరెక్టర్ అంతమంది ఉన్నారా అనగానే త్రిప్తి డిమ్రి(Tripthi Dimri) పేరు చెప్పాడు సంగీత్. ఇక నార్నె నితిన్ తనకు జాన్వీ కపూర్(Janhvi Kapoor) తో సినిమా చేయాలనుందని చెప్పాడు. అయితే మ్యాడ్ బాయ్స్ చెప్పిన పేర్లను పరిశీలిస్తే అన్నీ నార్త్ హీరోయిన్ల పేర్లే. తాము ఒకవేళ సౌత్ హీరోయిన్ల పేర్లు చెప్పామంటే వెంటనే అవి థంబ్నైల్స్ అయిపోతాయని అందుకే తాము తెలివిగా నార్త్ హీరోయిన్ల పేర్లు చెప్పామని సరదాగా అన్నాడు సంగీత్.













