‘షూటింగులెటూ లేవు కథలైనా రెడీ చేద్దాం బ్రదర్’ అన్నటుంది టాలీవుడ్ పరిస్థితి
షూటింగులు చేయడానికి అందరు భయపడుతున్న విషయం తెలిసిందే ఇటీవల బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ కుటుంబం, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబం కరోనా బారిన పడడంతో నటీనటుల్లో కరోనా భయం రెట్టింపైంది. బుల్లితెర షూటింగ్ లలో కూడా కొంత మందికి కరోనా సోకడం, కె బి సి ప్రోగ్రాం షూటింగ్లో అమితాబ్ పాల్గొనడం వల్లే కరోనా బారిన పడ్డారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో…షూటింగ్లు జరపడం అంత శ్రేయస్కరం కాదని టాలీవుడ్ అభిప్రాయపడుతోంది. ఇక విషయానికొస్తే…..
సినీ పరిశ్రమలో హీరో కు గాని, హీరోయిన్ కి గాని, దర్శకుడికి గాని, ఆఖరికి కామెడీ పాత్రలో చేసిన నటుడుకైనా సరే ఒక్క సినిమా హిట్ అయితే చాలు పుంఖాను పుంఖాలుగా ఆఫర్లు వస్తాయి.
ఈ విషయంలో దర్శకుడికి అదనంగా మరో పాయింట్ ఎక్కువ అని చెప్పాలి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా స్టార్ హీరో తో చేస్తే చాలు ఇక వాళ్లకు వచ్చే ఆఫర్లు అన్నీ కూడా అదే రేంజ్ లో ఉంటాయి అనే మాట వాస్తవం. ప్రతీ ఒక్కటి కూడా వాళ్లకు అన్ని విధాలుగా కలుస్తూనే ఉంటుంది. ఇక స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు కూడా వాళ్లకు ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చే పరిస్థితి అయితే టాలీవుడ్ లో ఉందనే చెప్పాలి.
ఏ హీరో అయినా సరే టాలెంట్ ఉండి మేకింగ్ బాగుంటే, ఒక సినిమా హిట్ అయితే చాలు అతనికి అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తారు. సినిమా తీసే విధానం బాగుంటే చాలు కచ్చితంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడమే కాకుండా వారిని నమ్మి భారీ సినిమాలు చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రభాస్ తో చేసిన సాహో సినిమా తెలుగు లో ఆడలేదు గాని బాలీవుడ్ లో మంచి బిజినెస్ చేసింది అంటే పాన్ ఇండియా మూవీస్ పనికి వచ్చే దర్శకుడని ప్రూవ్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు సుజీత్ ని మెగాస్టార్ చిరంజీవి ఇదే విధంగా నమ్మారు అని టాలీవుడ్ లో టాక్. అతను చేసింది రెండు సినిమాలు. అందులో ఒక సినిమా ఫ్లాప్. మరో సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. అయినా సరే ఇప్పుడు అతనికి మెగాస్టార్ చిరంజీవి మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నే వార్తలు వస్తున్నాయి. అతని టాలెంట్ ని ఆయన చాలా బాగా నమ్మారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. గత 20 రోజుల నుండి మెగా స్టార్ చిరంజీవి తన నివాసంలోనే అతని తో కలిసి ఆల్రెడీ సక్సెస్ అయినా కథ ‘లూసిఫర్’ స్క్రిప్ట్ ను రెడీ చేయిస్తున్నారని తెలిసింది. మంచి దర్శక ప్రతిభ వున్నా మెగా స్టార్ చిరంజీవి సుజీత్ కి సలహాలు సూచనలు ఇచ్చి కథను ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారని వినికిడి.













