బజ్ తక్కువైన సీనియర్ హీరోల సినిమాలు
సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. హనుమాన్ ఒక రోజు ముందుగానే ప్రీమియర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్‌ను తెచ్చుకుంది. గుంటూరు కారం ఎక్కువ థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల్ని అలరిస్తోంది. కానీ సీనియర్ హీరోల సినిమాలైన సైంధవ్, నా సామిరంగ సినిమాలకు మాత్రం రావాల్సిన బజ్ రాలేదు.
వాస్తవానికి ఈ రెండు సినిమాలు హీరోలిద్దరూ చాలానే కష్టపడ్డారు. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేశారు. కానీ రావాల్సిన హైప్ మాత్రం రాలేదు. దీనికి కారణం గుంటూరు కారం, హను మాన్ సినిమాలే. నెట్టింట ఎక్కడ చూసినా ఈ సినిమాల గురించే చర్చ. ఈ సినిమాల మధ్య సైంధవ్, నా సామిరంగ సినిమాలు కనిపించకుండా పోతున్నాయి.
కానీ ఒక్కసారి సినిమా రిలీజై మంచి టాక్ వస్తే మాత్రం ఎలాంటి పబ్లిసిటీ అవసరముండదు. తమ పోటీ సినిమాలకు రాబోయే టాక్ ను బట్టి ఎంత స్పీడ్ పెంచాలన్నది సీనియర్ హీరోలు డిసైడ్ కానున్నారట. సొంత డిస్ట్రిబ్యూషన్ అయినా సరే వెంకటేష్ కు రావాల్సినన్ని స్క్రీన్లు రాలేదని వెంకీ ఫ్యాన్స్ ఫీలవుతుంటే, సండే రిలీజ్ వల్ల నా సామిరంగకు హిట్ టాక్ వచ్చినా థియేటర్లు సరిపోవేమోననే టెన్షన్ లో అక్కినేని ఫ్యాన్స్ ఉన్నారు.













