యూట్యూబర్లపై మండిపడ్డ లోకేష్ కనగరాజ్
ప్రస్తుతం కోలీవుడ్(Kollywood) టాప్ డైరెక్టర్లలో ఒకడైన లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) మామూలుగా చాలా కూల్ గా కనిపిస్తుంటాడు. అలాంటి కూల్ గా ఉండే డైరెక్టర్ ఇప్పుడు చాలా కోపంతో ఉన్నాడు. లోకేష్ కొత్త సినిమా కూలీకి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేసినందుకు అతనికి యూట్యూబ్ ఛానెల్స్ పై విపరీతమైన కోపమొచ్చింది.
రీసెంట్ గా రజినీకాంత్(Rajinikanth) అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ట్రీట్మెంట్ తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే కూలీ సినిమా షూటింగ్లో భాగంగానే రజినీ ఇబ్బంది పడి ఆస్పత్రి పాలయ్యారని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో వార్తలొచ్చాయి. ఇలాంటి వార్తలకు మామూలుగా అయితే టాప్ డైరెక్టర్లెవరూ రెస్పాండ్ అవరు కానీ లోకేష్ మాత్రం ఈ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
రజినీ సార్‌తో మాట్లాడానని, ఆయన బాగానే కోలుకుంటున్నారని, తాను ఓ సమస్య నిమిత్తం చికిత్స తీసుకోబోతున్నట్లు తమ టీమ్ కు కొన్ని రోజుల ముందే చెప్పారని కానీ కొందరు యూట్యూబర్లు మాత్రం కూలీ షూటింగ్ లో ఆయనకు ఏదో అయినట్లు వార్తలు క్రియేట్ చేస్తున్నారని, ఇలాంటివి చూస్తే చాలా కోపమొస్తుందని, చిత్ర షూటింగ్ కంటే రజినీ సర్ ఆరోగ్యమే తమకు ముఖ్యమని, యూట్యూబ్ లో ఇష్టమొచ్చినట్లు వార్తలు క్రియేట్ చేసి ఇతరుల్ని బాధ పెట్టకండి. ఇలాంటివి ఇక ఆపేయండి, తిరిగి అక్టోబర్ 15 నుంచి రజినీ సార్ షూటింగ్ లో పాల్గొంటాడని యూట్యూబర్లపై లోకేష్ మండిపడ్డాడు. కూలీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.













