Game Changer: జనసేన పార్టీకి అప్పన్న పాత్రకి లింక్?
రామ్ చరణ్(Ram Charan) హీరోగా శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాలో చరణ్ (Charan)డ్యూయల్ పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. అందులో అప్పన్న పాత్రపై ట్రైలర్ లో పలు క్లూలు ఇచ్చారు కానీ అసలు ఈ పాత్ర సినిమాలో ఏ స్థాయిలో ఉంటుంది? ఎంత లెంగ్త్ ఉంటుందనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) ఈ కథను ఏ ఆలోచనతో రాశాడో కానీ జనసేన(Janasena) ఐడియాలజీకి చాలా దగ్గరగా అనిపించేలా అప్పన్న ఇందులో అభ్యుదయం పార్టీని స్థాపించాడని ఇన్ సైడ్ లీక్.
అరాచక ధోరణి చూపిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే నెపంతో శ్రీకాంత్(Srikanth), సముద్రఖని(Samuthirakani), రాజీవ్ కనకాల(Rajeev Kanakala)తో కలిసి అప్పన్న పెట్టే పార్టీ తక్కువ టైమ్ లోనే ప్రజల మనసులకు దగ్గరవడం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీరుని గుర్తు చేస్తుందంటున్నారు. అమెరికా ఈవెంట్ లో గేమ్ ఛేంజర్ లో వర్తమాన సంఘటనలు చాలా చూస్తారని దిల్ రాజు(Dil Raju) చెప్పింది దీని గురించేనని అంటున్నారు.













