NTR: ఎన్టీఆర్ను కలిపించమని మంత్రికి లేఖ
క్యాన్సర్ తో బాధ పడుతున్న తన కూతురు స్వాతి(Swathi) గురించి తెలంగాణ హుజూరాబాద్ కు చెందిన ఓ తల్లి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkatareddy)కి లెటర్ రాశారు. తన కూతురు స్వాతి బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతుందని, జూ. ఎన్టీఆర్(Jr. NTR) ను కలిసి మాట్లాడటమే స్వాతి ఆఖరి కోరికని రజిత(Rajitha) మంత్రికి రాసిన లెటర్ లో పేర్కొంది.
ఆస్పత్రి మంచంపై ఉన్న తన కూతురి ఆఖరి కోరికను ఎలాగైనా తీర్చాలని ఆమె మంత్రిని కోరింది. దీంతో ఈ లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఎలాగైనా సరే ఈ విషయాన్ని ఎన్టీఆర్(NTR) దగ్గరకు తీసుకెళ్లి స్వాతి ఆఖరి కోరికను తీర్చాలని ఫ్యాన్స్ ఆ లేఖను తెగ షేర్ చేస్తున్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న తన ఫ్యాన్స్ ను తారక్ గతంలో ఎన్నోసార్లు కలిశాడు.
గతేడాది సెప్టెంబర్ లో కూడా క్యాన్సర్ తో బాధపడుతూ చావు బతుకుల మధ్య వరకు వెళ్లిన కౌశిక్(Koushik) అనే అభిమానితో తారక్ ఫోన్ లో మాట్లాడి అతనికి ధైర్యం చెప్పి, ట్రీట్మెంట్ కు కావాల్సిన ఖర్చంతా తానే భరిస్తానని మాట కూడా ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారమే కౌశిక్ హాస్పిటల్ బిల్ మొత్తాన్ని ఎన్టీఆరే భరించాడు. ఇప్పుడు స్వాతి విషయంలో కూడా ఎన్టీఆర్ ఆమె కోరికను తీరుస్తాడని అందరూ భావిస్తున్నారు.













