Lenin: లెనిన్ షూటింగ్ అప్డేట్

అక్కినేని అఖిల్(akkineni akhil) ఓ భారీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు హీరోగా ఎదగడానికి అఖిల్ చాలా కష్టపడుతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most eligible bachelor) మూవీతో హిట్ అందుకున్నా ఆ సినిమా అఖిల్ ను నిలబెట్టలేకపోయింది. ఇక ఆఖరిగా వచ్చిన ఏజెంట్(agent) సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పే పన్లేదు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అఖిల్ ఆశలన్నీ లెనిన్(Lenin) మీదనే పెట్టుకున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ లుక్, జానర్ మార్చి హిట్ అందుకోవాలని చాలా కష్టపడుతున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరు(murali kishore abburu) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments), అన్నపూర్ణ(Annapurna studios) బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఈ మూవీపై అటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటూ నార్మల్ ఆడియన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. లెనిన్ మూవీ షూటింగ్ 70% షూటింగ్ పూర్తైందని, క్లైమాక్స్ కూడా పూర్తైతే షూటింగ్ ఫినిష్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మొదట శ్రీలీల(sree leela) హీరోయిన్ గా నటించగా, మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకుంది. శ్రీలీల తప్పుకున్న తర్వాత భాగ్యశ్రీ బోర్సే(bhagyasri borse) ఆ స్థానంలోకి వచ్చింది.