కోవిడ్‌తో ప్రముఖ దర్శకుడు సాయి బాలాజీ మృతి
దేశంలో కరోనా ఉదృతి రోజురోజుకూ రెట్టింపవుతోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదు కావడం, వేలల్లో కరోనా మరణాలు చోటు చేసుకోవడం ప్రతి ఒక్కరిలో గుబులు పుట్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌తో మరోసారి సినీ ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కరోనా కారణంగా టాలీవుడ్ దర్శకుడు, రచయత ఎన్. సాయి బాలాజీ ప్రసాద్ (ఎన్. వర ప్రసాద్) మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే చాలామంది సినీ నటులు కరోనా బారినపడగా.. నేడు ఏప్రిల్ 26న ఉదయం టాలీవుడ్ దర్శకుడు, రచయత ఎన్. సాయి బాలాజీ ప్రసాద్ (ఎన్. వర ప్రసాద్) కోవిడ్ -19తో మరణించారు. కరోనా కారణంగా కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న సాయి బాలాజీ ప్రసాద్ హైదరాబాద్, గచ్చ్చిబౌలి లోని టిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 57 సంవత్సరాలు. రియల్ స్టార్ శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’ చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు సాయి బాలాజీ ప్రసాద్. ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’ సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు.













