సీనియర్ స్టార్స్ తో నటిస్తే యంగ్ హీరోస్ అవకాశం ఇవ్వరా?
సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి అందం చూసి తాను ఫిదా అయ్యానని ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఓ పబ్లిక్ వేడుకలో పొగిడి ఆమెకి కాంప్లిమెంట్ అందించాడంటే అది చిన్న విషయం కాదు. భలే భలే మగాడివోయ్ చిత్రంలో లావణ్య సొట్టబుగ్గలు, అందం చూసి తాను ఫిదా అయ్యానని ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఓ పబ్లిక్ వేడుకలో పొగిడి ఆమెకి కాంప్లిమెంట్ అందించాడంటే అది చిన్న విషయం కాదు. ఇక ఈ 29 ఏళ్ల అమ్మడు 2006లో అంటే దాదాపు 14 ఏళ్ల కిందట తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. 2012లో హనురాఘవపూడి దర్శకత్వంలో నవీన్ చంద్ర సరసన నటించి అందాల రాక్షసి అనే పేరునే తన బిరుదుగా మార్చుకుంది.
ఈమె సినీ నటి కాకముందు ఫెయిర్ అండ్ లవ్లీ కాస్మటిక్స్, బినాని సిమెంట్ వంటి యాడ్స్ లో నటించింది. అందాల రాక్షసి తర్వాత ఈమె వీరు పోట్లా దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటించిన దూసుకెళ్తా, అక్కినేని ఫ్యామిలీ చిత్రం మనం, మారుతి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన భలే భలే మగాడివోయ్, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సోగ్గాడే చిన్నినాయనా, రాజమౌళి శిష్యుడైన తలసిల జగదీష్ దర్శకత్వంలో అందాల రాక్షసి తర్వాత మరోసారి నవీన్ చంద్రతో కలిసి లచ్చిందేవికో లెక్కుంది, పరుశురాం దర్శకత్వంలో అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు.. శుభమస్తు, శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటించిన మిస్టర్, చంద్రమోహన్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన రాధ, కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో నాగచైతన్య నటించిన యుద్దం శరణం, కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ, వినాయక్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయితేజ్ నటించిన ఇంటెలిజెంట్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగాప్రిన్స్తో మిస్టర్ తర్వాత అంతరిక్షం, టి. సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ సిద్దార్డ్ హీరోగా నటించిన అర్జున్ సురవరం వంటి చిత్రాలలో నటించింది.
జెనీలియా పెళ్లి చేసుకుని నటనకు స్వస్తి చెప్పిన తరువాత అదే చలాకీతనం ఫిచర్స్ వున్నా లావణ్య జెనీలియాకి రీప్లేస్ అనుకున్నారు. ఇలా ఇన్ని చిత్రాలలో నటించిన స్టార్ హీరోల చిత్రాలలో మాత్రం అవకాశం రాలేదు. కేవలం సీనియర్ స్టార్ నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో నటించింది. నాగార్జునతో ఆమె చేసిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రం బ్లాక్ బస్టర్ అయినా కూడా అందులో లావణ్య త్రిపాఠి పాత్రను రమ్యకృష్ణ డామినేట్ చేయడంతో ఆ సినిమాతో లావణ్య కి ఒరిగింది ఏమీ లేదనే చెప్పాలి.
ఈ సినిమాలో ఆఫర్ వచ్చిన సమయంలో ఆమె శ్రేయోభిలాషులు పలువురు నాగార్జున వంటి సీనియర్ స్టార్ తో నటించవద్దు. అలా నటిస్తే ఇక యంగ్ హీరోల సరసన చాన్స్‌లు రావు. ఒక్కసారి సీనియర్ స్టార్ అయిన నాగార్జునతో నటిస్తే ఆ తర్వాత కూడా నీకు సీనియర్స్ సరసనే చాన్స్ లు వస్తాయి…అని హితవు పలికారంట. దాంతో లావణ్య ఎంతో అనుమానంతోనే ఆ చిత్రంలో నటించిందట. గతం లో అంకిత కూడా ఇలాంటి పొరపాట్లే చేసి తన కెరీర్ కి తానే ఫుల్ స్టాప్ పెట్టుకుంది. ఎన్టీర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి తరువాత బాలకృష్ణ హీరోగా చేసిన విజయేంద్ర ప్రసాద్ చిత్రం లో నటించింది.
తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పుకొచ్చింది. సోగ్గాడే చిన్నినాయనా చిత్రం నాకు ఎన్నో మంచి విషయాలను నేర్పింది. షూటింగ్ సమయంలో నాగార్జున గారు నాకు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారు. మంచి గైడెన్స్ ఇచ్చారు. ఇప్పటికీ నాకేదైనా సలహా కావాలంటే నాగార్జున గారినే అడుగుతాను. ఇక గత కొన్ని చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా చిత్రాలు ఆడవని తెలిసినా నటించాల్సి వచ్చింది. ఇకపై ఇలాంటి చిత్రాలు చేయకుండా జాగ్రత్తపడుతాను. ప్రస్తుతం తెలుగులో ఒకటి, తమిళంలో రెండు చిత్రాలలో నటిస్తున్నాను. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. నా కెరీర్ పై నాకెన్నో ఆశలు ఉన్నాయని ఈ సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది.













