Laila: లైలా హిట్ అవాలంటే ఎంత తీసుకురావాలంటే
విభిన్న కథలను ఎంచుకుంటూ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్న టాలెండెట్ హీరో విశ్వక్ సేన్(Viswaksen) ఇప్పుడు లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ నారాయణ్(Ram Narayan) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్ గా నటించగా, షైన్ స్క్రీన్స్(Shine Screens) బ్యానర్ లో సాహు గారపాటి(Sahu garapati) లైలా(Laila)ను నిర్మించాడు. ఈ మూవీలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనుండటంతో లైలాపై అందరికీ మంచి అంచనాలేర్పడ్డాయి.
యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను నిర్మాత సాహు గారపాటి దాదాపు రూ. 35 కోట్లతో నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగినట్టు సమాచారం. ఆంధ్రా, నైజాం ఏరియాల్లో లైలా హక్కులు రూ.6 కోట్లకు అమ్ముడు పోగా, తెలుగు రాష్ట్రాల్లో లైలా మూవీ రూ. 7 కోట్ల షేర్, రూ.14 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది.
మిగిలిన రాష్ట్రాలు, ఓవర్సీస్ అన్నీ కలిపి మరో రూ. 2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే మొత్తమ్మీద లైలాకు రూ.8.5 కోట్ల బిజినెస్ జరిగిందన్నమాట. దాన్ని బట్టి చూసుకుంటే లైలా సినిమాకు రూ.10 కోట్లకు పైగా షేర్ రాబడితే సినిమా లాభాల్లోకి వచ్చినట్టే. సినిమాకు టాక్ బావుంటే అది పెద్ద కష్టమేమీ కాదు. మరికొన్ని గంటల్లో లైలా టాక్ బయటకు రానుంది.













