Kuberaa: కుబేర ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

ధనుష్(dhanush) హీరోగా శేఖర్ కమ్ముల(sekhar kammula) దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా కుబేర(Kuberaa). ధనిక, నిరుపేద తేడా చూపిస్తూ శేఖర్ కమ్ముల ఈ సినిమాను ఎంతో గొప్పగా తెరకెక్కించారు. కుబేరలో బిచ్చగాడి పాత్రలో ధనుష్ ఎంతో మంచి నటనను కనబరిచారు. నాగార్జున(nagarjuna), రష్మిక మందన్నా(Rashmika Mandanna) కుబేరలో కీలక పాత్రలు చేసి వారు కూడా ఆడియన్స్ ను ఎంతగానో మెప్పించారు.
గత నెల 20వ తేదీన రిలీజైన కుబేర ఇప్పటికీ థియేటర్లలో బానే రన్ అవుతుంది. అయితే ఓ వర్గం ఆడియన్స్ మాత్రం కుబేర ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కుబేర ఓటీటీ రిలీజ్ గురించి ఓ అప్డేట్ తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కుబేర జులై 18 నుంచి ఓటీటీలోకి రానుందని అంటున్నారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియో(Prime Video) కుబేర డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, జులై 18 నుంచి కుబేర ఓటీటీలోకి రానుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికైతే ఈ తేదీలోనే కుబేర రానుందంటున్నారు. మరి ఈ తేదీలోనే సినిమా ఓటీటీలోకి వస్తుందా లేదా సినిమాకు మంచి బుకింగ్స్ ఉన్న నేపథ్యంలో ఏమైనా వాయిదా పడుతుందా అనేది తెలియాలంటే ఆ ఓటీటీ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సిందే.