Kuberaa: సెకండ్ వీక్ లోనూ అదరగొడుతున్న కుబేర

గత కొన్ని వారాలుగా సరైన సినిమా లేక థియేటర్లు వెల వెలబోతున్న టైమ్ లో కుబేర(Kuberaa) సినిమా వచ్చింది. ధనుష్(Dhanush) హీరోగా నాగార్జున(Nagarjuna) కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో వహించారు. రష్మిక మందన్నా(rashmika mandanna) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుబేర మొదటి ఆట నుంచే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
మొత్తానికి చాలా రోజుల తర్వాత కుబేర పుణ్యమా అని థియేటర్లు కళకళలాడాయి. కుబేరకు అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్స్ పడ్డాయి. మొదటి వారం సక్సెస్‌ఫుల్ రన్ ను పూర్తి చేసుకున్న కుబేర ఇప్పుడు రెండో వారంలోకి ఎంటరైంది. సెకండ్ వీకెండ్ లో కూడా కుబేరకు సాలిడ్ కలెక్షన్లు నమోదవడం విశేషం. సెకండ్ వీకెండ్ లో శనివారం ఫస్ట్ షో నుంచే కుబేరకు మంచి బుకింగ్స్ నమోదయ్యాయి.
సెకండ్ వీక్ లో కన్నప్ప సినిమా వచ్చినప్పటికీ ఆ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రాకపోవడంతో ఫ్యామిలీలు శేఖర్ కమ్ముల సినిమా చూడ్డానికే మొగ్గు చూపుతున్నారు. బుకింగ్స్ చూస్తుంటే కుబేర సెకండ్ వీకెండ్ లో కూడా అదే ఫైర్ తో మంచి కలెక్షన్లు రాబట్టడం ఖాయమనిపిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందించిన ఈ సినిమాలో ధనుష్ తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించాడు.