Kuberaa: మరో రేర్ ఫీట్ సాధించిన కుబేర

శేఖర్ కమ్ముల(Sekhar Kammula) సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే దాని కోసం వెయిట్ చేసే ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర(Kuberaa) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ ధనుష్(Dhanush) హీరోగా నటించిన ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కీలక పాత్ర పోషించగా, రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటించింది.
భారీ అంచనాలతో రిలీజైన కుబేర ఆ అంచనాలను అందుకోవడమే కాకుండా అద్భుతమైన మూవీగా కుబేర నిలుస్తోందని సినిమా చూసిన వారందరూ చెప్తున్నారు. కుబేర సినిమాతో ధనుష్ వరుసగా మరో రూ.100 కోట్ల గ్రాసర్ ను అందుకోగా కుబేర సినిమా ఇప్పుడో రేర్ ఫీట్ ను సాధించింది. కుబేర మూవీ సినిమాలో యాక్ట్ చేసిన ధనుష్, నాగ్ కెరీర్లోనే కాకుండా శేఖర్ కమ్ముల కెరీర్లో కూడా హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
యూఎస్ లో కుబేర మూవీ 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ తో రికార్డులను బ్రేక్ చేసింది. శేఖర్ కమ్ములకు యూఎస్ లో మంచి మార్కెట్ ఉండటంతో అక్కడ ఆయన సినిమాలు బాగా ఆడతాయి. అన్ని సినిమాల్లానే శేఖర్ నుంచి వచ్చిన కుబేర కూడా హయ్యెస్ట్ గ్రాస్ ను అందుకుని రికార్డు సృష్టించింది. మొత్తానికి కుబేర సినిమా యూఎస్ లో ముగ్గురికీ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.