Krithi Shetty: థై స్లిట్ డ్రెస్ లో మరింత అందంగా కృతి
ఉప్పెన(Uppena) సినిమాతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న కృతి శెట్టి(Krithi Shetty)కి ఆ సినిమా సక్సెస్ అవడంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తర్వాత కొన్ని సినిమాలు హిట్లు అయినప్పటికీ తర్వాత కృతి నటించిన సినిమాలన్నీ ఫ్లాపులవడంతో అమ్మడి క్రేజ్ తగ్గింది. సినిమాలతో ఆడియన్స్ కు టచ్ లో లేకపోయినా సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను అందిస్తూ కృతి ఎప్పుడూ తన ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. రీసెంట్ గా కృతి ఓ డిజైనర్ వేర్ లో కనిపించి అందరినీ ఆకర్షించింది. థై స్లిట్ డ్రెస్ లో అమ్మడు ఎంతో అందంగా ఉందని ఆమె ఫాలోవర్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.






