కోలీవుడ్పైనే కృతి ఆశలన్నీ!
ఉప్పెన(Uppena) సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి(Krithi Shetty)కి మొదటి సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ వల్లే వరుస అవకాశాలు అందుకుంది. అమ్మడు వరుసపెట్టి సినిమాలు చేసినప్పటికీ అవన్నీ ఫ్లాపులుగా మిగలడంతో త్వరగా ఫాం కోల్పోయింది. దీంతో అమ్మడికి టాలీవుడ్ లో అవకాశాలు రావడం తగ్గాయి.
అందుకే ఇప్పుడు కృతి కోలీవుడ్ పై ఫోకస్ చేసింది. జయం రవి(Jayam Ravi)తో ఓ సినిమా ఆఫర్ అందుకున్న కృతి(Krithi), ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) తో ఓ సినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాలతో ఎలాగైనా హిట్ అందుకుని కోలీవుడ్ లో తన సత్తా చాటాలని చూస్తోంది బేబమ్మ అలియాస్ కృతి శెట్టి. సినిమాలతో పాటూ ఈ మధ్య యూత్ ని ఎట్రాక్ట్ చేసే ఫోటోషూట్స్ తో కూడా ఎక్కువ ఫ్యాన్స్ ను సంపాదిస్తుంది కృతి.
తను చేస్తున్న రెండు సినిమాల్లో ఏ ఒక్క సినిమా హిట్ అయినా సరే తన మకాంను తమిళ ఇండస్ట్రీకి మార్చాలని చూస్తుందట కృతి. తమిళంతో పాటూ మలయాళంలో కూడా ఈ మధ్యే టోవినో థామస్(Tovino thomos) తో ఓ సినిమా చేసింది కృతి. ఆ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ మలయాళంలో సోసోగా అనిపించినప్పటికీ, తెలుగు, తమిళ ఆడియన్స్ మాత్రం ఆ సినిమాను అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. మరి కృతి మళ్లీ ఫామ్ లోకి ఎప్పుడొస్తుందో చూడాలి.













