క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్
గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ బయోపిక్‌పై అనేక సందేహాలు నెలకొన్నాయి. అసలు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్నే ఆపేశారని వార్తలు కూడా వచ్చాయి. వీటన్నింటికి తెరదించుతూ ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాను గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించనున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాత, ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంతకుముదు ఈ చిత్రాన్ని దర్శకుడు తేజ తెరకెక్కించాలని ఉంది. అయితే బాలకృష్ణ ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన కొద్ది రోజులకే తేజ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దాంతో ఇప్పుడు ఈ అవకాశం క్రిష్‌కు దక్కింది. మరి ఈ సినిమాను క్రిష్ ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.













