Kota Srinivasa Rao: తెలుగు కళమా తల్లి ముద్దు బిడ్డ కోట శ్రీనివాసరావు కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) (83) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల కాలంలో వందలాది చిత్రాల్లో విలక్షణ పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్య నటుడిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యారు. కోట మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గత నాలుగు దశాబ్దాలుగా కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కోట.. సినిమాలు పూర్తిగా మానేసి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్య నటుడిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఆయన సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించారు. కోట శ్రీనివాసరావు మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని కంకిపాడు గ్రామంలో 1942, జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావుకి చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. కొన్ని వందల నాటకాల్లో నటించిన ఆయన 1978లో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నాలుగున్నర దశాబ్దాల కెరీర్లో వందల కొద్ది సినిమాల్లో విలన్, సహాయ పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, హాస్యం, విలనిజం, సెంటిమెంట్, పౌరాణికం… ఇలా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలిలో పండించగల విలక్షణ నటుడుగా కోట శ్రీనివాసరావు గుర్తింపు తెచ్చుకున్నారు.