Kiran Abbavaram: నిర్మాతగా రెండో సినిమాను లైన్ లో పెట్టిన కిరణ్

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన కిరణ్ అబ్బవరం(kiran abbavaram) మొదటిగా రాజా వారు రాణి గారు(raja varu rani garu) సినిమా చేశాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ అతని మంచి విజయాన్ని ఇచ్చిన సినిమా మాత్రం క(KA). ఆ సినిమా సక్సెస్ కిరణ్ కు చాలా ఊరటనిచ్చింది. క సినిమా తర్వాత కిరణ్ కు చాలా అవకాశాలు రావడంతో పాటూ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.
ఇప్పటికే కె ర్యాంప్(K Ramp) సినిమాను పూర్తి చేసి దాన్ని రిలీజ్ కు రెడీ చేసిన కిరణ్ అబ్బవరం, ఆ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నాడు. అవి కాకుండా ఈ యంగ్ హీరో చేతిలో మరిన్ని ప్రాజెక్టులనున్నాయి. ఇప్పటికే చెన్నై లవ్ స్టోరీ(Chennai Love Story) షూటింగ్ ను మొదలుపెట్టిన కిరణ్ చేతిలో 5 కొత్త సినిమాలుండగా అవన్నీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. కాగా కిరణ్ రీసెంట్ గా KA ప్రొడక్షన్స్(KA Productions) పేరిట బ్యానర్ ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
ఆల్రెడీ నిర్మాతగా బ్యానర్ ను స్టార్ట్ చేసిన కిరణ్, అందులో తిమ్మరాజుపల్లి టీవీ(thimmarajupalli tv) అనే టైటిల్ తో ఓ సినిమాను నిర్మిస్తుండగా ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే కిరణ్ నిర్మాతగా ఇప్పుడు రెండో సినిమాను లైన్ లో పెట్టారని తెలుస్తోంది. ఓ కొత్త డైరెక్టర్ తో తానే నటిస్తూ సినిమాను నిర్మించడానికి కిరణ్ రెడీ అయ్యాడట. వచ్చే ఏడాది నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. మొత్తానికి కిరణ్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు తన నిర్మాణ సంస్థలో వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతూ తన బ్యానర్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ మంచి ప్లానింగ్ లో ఉన్నాడు.