Kiran Abbavaram: కిరణ్ ఇకనైనా రూటు మార్చాల్సిందే!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) క(KA) అనే సినిమాతో తన కెరీర్లోనే పెద్ద హిట్ ను అందుకున్నాడు. కానీ క సినిమా తర్వాత వచ్చిన దిల్ రూబా(Dil Ruba) సినిమా మాత్రం కిరణ్ కు తీవ్ర నిరాశను మిగిల్చింది. వాస్తవానికి క సినిమా కంటే ముందే దిల్ రూబా రిలీజవాల్సింది కానీ క సినిమా మీదున్న నమ్మకంతో దాన్ని ముందు రిలీజ్ చేసి, ఆ తర్వాత క హిట్ ను దిల్ రూబా కోసం క్యాష్ చేసుకోవాలనుకున్నాడు కిరణ్.
అలా అనుకునే క తర్వాత దిల్ రూబాను రిలీజ్ చేశాడు. ఈ రెండు సినిమాలు వెంటవెంటనే రిలీజైనప్పటికీ ఆ రెండు సినిమాల ప్రొడక్షన్ కు మాత్రం చాలా టైమ్ పట్టింది. ఇదిలా ఉంటే కిరణ్ ప్రస్తుతం కె ర్యాంప్(K Ramp) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే తన తర్వాతి సినిమాగా చెన్నై లవ్ స్టోరీ(Chennai Love Story) సినిమాను రీసెంట్ గానే అనౌన్స్ చేశాడు.
అయితే కిరణ్ సినిమాలైతే అనౌన్స్ చేస్తున్నాడు కానీ వాటిని ఫినిష్ చేసి రిలీజ్ చేయడానికి మాత్రం చాలానే టైమ్ తీసుకుంటున్నాడు. కిరణ్ లాంటి మీడియం రేంజ్ హీరో కూడా ఒక్కో సినిమాకు ఇంత టైమ్ తీసుకుంటుంటే థియేటర్లలో ఇక సినిమాలు ఎలా ఉంటాయని అందరూ ప్రశ్నిస్తున్నారు. దీంతో కిరణ్ ఇకనైనా స్పీడు పెంచి వేగంగా సినిమాలు చేయాలని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పటికైనా కిరణ్ తన స్పీడు మారుస్తాడేమో చూడాలి.