క క్లైమాక్స్ గురించి కిరణ్ అబ్బవరం సెన్సేషనల్ కామెంట్స్
తమ సినిమాలపై నమ్మకంతో యూత్ హీరోలు ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవి నిజమైతే మరికొన్ని సందర్భాల్లో మిస్ ఫైర్ అవుతూంటాయి. శ్రీవిష్ణు(Sri Vishnu), విశ్వక్సేన్(Viswaksen) గతంలో పలుసార్లు ఇలాంటి కామెంట్స్ చేయగా ఇప్పుడీ లిస్టులోకి కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) జాయిన్ అయ్యాడు. ఈ నెలాఖరున రిలీజ్ కానున్న క(KA) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కిరణ్ అబ్బవరం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
క సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా ట్రీట్మెంట్, పాయింట్ ను చెప్పిన విధానం కొత్తగా అనిపించకపోయినా, ఇంతకు ముందు చూసినట్లనిపించినా ఇకపై యాక్ట్ చేయననే టైప్ లో శపథం చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ సినిమాపై కిరణ్ ఏ రేంజ్ లో కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే సొంతంగా నిర్మాణంలో భాగం కావడంతో పాటూ ఈ మూవీ కోసం దీనికంటే ముందు రిలీజ్ చేయాల్సిన దిల్ రూబా(Dil Ruba) సినిమాను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడు.
అందుకే గట్టి పోటీ ఉన్నప్పటికీ తమిళనాడు లో ఓ వారం లేట్ గా రిలీజ్ చేయాల్సి వచ్చినప్పటికీ రిస్క్ తీసుకోవడానికి రెడీ అయ్యాడు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక క మూవీ లెక్కలన్నీ మారాయి. ట్రైలర్ చూశాక మిస్టిక్ థ్రిల్లర్ జానర్ లో ఏదో కొత్తగా ట్రై చేశారనే ఫీలింగ్ కలిగింది. కిరణ్ ఇంతగా చెప్తున్నాడంటే క సినిమాలో ఏదో మ్యాటర్ ఉన్నట్లు అర్థమవుతుంది.













