డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్న కిరణ్ అబ్బవరం
ప్రస్తుత కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది అందరికీ బాగా అలవాటైపోయింది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు వారి ఇష్టప్రకారం తమకు నచ్చిన ప్లేస్ ను సెలెక్ట్ చేసుకుని అతి తక్కువ మందితో తమ పెళ్లి తంతు కానిచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ ఏడాది పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే.
కిరణ్ తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ తో చాలా కాలంగా ప్రేమాయణం నడుపుతున్నాడు. ఇప్పుడు ఫైనల్ గా ఇద్దరి ఇంట్లో పెద్దలను ఒప్పించి తమ బంధాన్ని పెళ్లితో నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఆగస్ట్ 22న వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.
వీరి పెళ్లి కేరళలో జరగనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యలో ఈ వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే వెన్యూని ఫిక్స్ చేసినట్లు సమాచారం. రాజా వారు రాణి గారు సినిమా టైమ్ నుంచే వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ నడుస్తోంది. కెరీర్ లో సక్సెస్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన కిరణ్, ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు రావడంతో పెళ్లి పీటలెక్కడానికి నిర్ణయించుకున్నాడు.













