కిల్ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలకు మరే సినిమాలు పోటీ ఇచ్చేవి కావు. ఆ సినిమాలతో పోల్చడానికి కూడా ఎవరూ సాహసం చేసేవారు కాదు. కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత ఇండియన్ సినిమా క్రేజ్ పెరిగిపోయింది. ఆ సినిమాను చూసి జేమ్స్ కామెరూన్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయారు. ఇక రీసెంట్ గా మరో సినిమా హాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.
మన ఇండియన్ సినిమాను ఓ హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అధికారికంగా రీమేక్ రైట్స్ కొని రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ సినిమానే కిల్. లక్ష్య అనే అప్కమింగ్ నటుడిని హీరోగా పెట్టి నిఖిల్ భట్ అనే యువ దర్శకుడు రూపొందించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బెస్ట్ యాక్షన్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. జులై 5న రిలీజైన ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ సినిమాను థియేటర్లలో చూడలేని వాళ్లు కిల్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఆ ఎదురుచూపులు సెప్టెంబర్ 6న ఫలించబోతున్నాయి. ఆ రోజు నుంచి డిస్నీ హాట్ స్టార్ కిల్ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ఒక ట్రైన్ లోకి చొరబడ్డ దొంగల ముఠా హీరో ఫ్యామిలీని తన కళ్ల ముందే అంతమొందిస్తే హీరో ఆ దొంగలను ఎలా అంతం చేశాడనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.













