అల్లు అర్జున సరసన బాలీవుడ్ భామ
అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప పాన్ ఇండియా సినిమాగా ప్రకటించడంతో సినీ వర్గాల్ల ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దక్షిణాది నుండి మరో పాన్ ఇండియా స్టార్ వస్తున్నాడని వారు ఆహ్వానం పలుకుతున్నారు. పుష్ప చిత్రానికి సుకుమార్ దర్శకుడు కావడంతో అంచనాలు ఇంకా పెరిగాయి. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లు అన్నీ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనివల్ల పుష్పకు సం•ంధించి షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమా గంధపు స్మగ్లింగ్ నేపథ్యం లో ఉంటుందని ఫస్ట్‌లుక్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇకపోతే పాన్ ఇండియా సినిమా అనగానే దానికి తగినట్టుగానే స్టార్స్ ఉంటారు. విలన్, హీరోయిన్లను బాలీవుడ్ నుండి దిగుమతి చేసుకునే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. సంజయ్‌దత్, జాకీష్రాఫ్, సునీల్ శెట్టి, అజయ్ దేవగణ్ వంటి వారి చేత విలన్‌గా నటింపజేస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఓ ప్రత్యేక గీతాన్ని అందాల తార కియారా అద్వానితో చేయిస్తే ఎలా ఉంటుందని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇది ప్రచారమేనా లేక నిజామ అనే దానిపై సృష్టత రావాల్సి ఉంది.













