ఆమెకు ఏకంగా 3 కోట్ల రుపాయల రెమ్మ్యూనరేషన్

బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా వరుస సినిమాలతో సత్తా చాటుతున్న కియారా అద్వానీ మరోసారి తెలుగు తెరపై సందడి చేయనుందట. అది కూడా ఎన్టీఆర్ సరసన. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా కోసం కియారాను హీరోయిన్‌గా సెలక్ట్ చేశారని టాక్. ఇందుకోసం ఆమెకు ఏకంగా 3 కోట్ల రుపాయల రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఆమెకు ఇంత మొత్తం ఇస్తున్నారని తెలియడం జనాల్లో చర్చనీయాంశం అయింది.