Khushbu: ఈ ఘటన నన్నెంతో షాక్కు గురి చేసింది .. ఖుష్బూ ఆగ్రహం
నెలసరి పేరిట ఓ విద్యార్థినిని తరగతి గది బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించిన ఘటన తమిళనాడు (Tamil Nadu)లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అమానవీయ ఘటనపై తాజాగా నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ (Khushbu ) ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలసరి కారణంగా ఒక విద్యార్థినిని క్లాస్ రూమ్ బయటే కూర్చొపెట్టి పరీక్ష (exam) రాయించడం నిజంగా విచారకరం. నా రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన నన్నెంతో షాక్కు గురి చేసింది. మనం ఏ యుగంలో బతుతకుతున్నాం? ఎక్కడ ఉన్నాం? ఇలాంటి పనులకు పాల్పడిన విద్యాసంస్థలు (Educational institutions), అందులోని సిబ్బంది (Staff)కి ఏమాత్రం సిగ్గుగా అనిపించడం లేదా? వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఆ విద్యార్థిని (Student )కి వారు క్షమాపణలు చెప్పాలి. నెలసరి అనేది సాధారణ, సహజమైన చర్య. మానసిక పరిపకత్వ లేని ఇలాంటి అధికారులకు సరైన గుణ పాఠం నేర్పించాలి అని అన్నారు.













