విశ్వంభరలో ఖుష్బూ
భోళా శంకర్ తర్వాత ఎంతో గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. ఎలక్షన్స్, విదేశీ టూర్ల కోసం చిరంజీవి షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నాడు. త్వరలోనే విశ్వంభర కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఇప్పటివరకు ఈ సినిమాలోని ఇంటర్వెల్ ఎపిసోడ్, ఓ సాంగ్ తో పాటూ కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉందట. ఆ పాత్ర కోసం పవర్ఫుల్ లేడీ కావాల్సి ఉంది. ముందుగా ఈ పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించారు.
కానీ ఆమెకు సినిమాలు చేసే ఉద్దేశం లేక సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించిందట. దీంతో ఆ ఆఫర్ ఖుష్బూ కు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే స్టాలిన్ లో చిరంజీవితో కలిసి ఆయనకు అక్క పాత్రలో నటించిన ఖుష్బూ ఇప్పుడు మరోసారి చిరూతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇంకా చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ దాదాపు కన్ఫర్మ్ అయిందని టాక్. భారీ వీఎఫెక్స్ తో రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.













