కేజీఎఫ్ హీరో తో పూరి జగన్నాధ్ పాన్ ఇండియా మూవీ?
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ మరో పాన్ ఇండియా సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం కేజీఎఫ్ స్టార్ యశ్‌తో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ‘కేజీఎఫ్’ ఆలిండియా స్టార్‌గా ఎదిగిన కన్నడ నటుడు యశ్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. కన్నడ పరిశ్రమలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం, దక్షిణాదితో పాటు హిందీలోనూ మంచి విజయం అందుకుంది. కేజీఎఫ్-2 తర్వాత యశ్ ఎవరితో సినిమా తీస్తారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
ఈ కోవలోనే చాలామంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ తెలుగులో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న పూరీ జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతోదంటూ టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అది పూర్తయ్యాక ఓ పాన్ ఇండియా సినిమా తీసేందుకు కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. దీనిపై యశ్-పూరీ మధ్య కొంతకాలంగా చర్చలు నడుస్తున్నాయి. వీరి కలయికలో సినిమా రానుందని ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.













