గ్లామర్ గేట్లు ఎత్తేసిన కీర్తి?
సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో డీసెంట్ రోల్స్ మాత్రమే చేసిన కీర్తి సురేష్, మహానటి తర్వాత అలాగే కొనసాగాలని ఎంతో స్ట్రాంగ్ గా డిసైడైంది. దీంతో అమ్మడు చాలా కోల్పోయింది. దర్శకనిర్మాతలు నుంచి కీర్తికి పెద్దగా ఛాన్సులు రాకపోవడంతో విషయం అర్థం చేసుకున్న అమ్మడు డైరెక్టర్లను అర్థం చేసుకుని వారి దారిలోకే వచ్చింది.
ఈ క్రమంలోనే సర్కారు వారి పాట సినిమాలో కళావతిగా గ్లామర్ రోల్ లో మెరిసింది కీర్తి. ఇదిలా ఉంటే కీర్తి ఇప్పుడు టాలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలతో పాటూ వెబ్ సిరీస్‌ల్లో కూడా కీర్తి నటిస్తోంది. అయితే టాలీవుడ్ లో బాలీవుడ్ లో కీర్తి టైమ్ వేస్ట్ చేయదలచుకోలేదు.
అందుకే కీర్తి అక్కడ గ్లామర్ గేట్లు ఎత్తేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి చేస్తున్న బేబీ జాన్ సినిమాలో అమ్మడు ఏకంగా లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ లో నటించేసిందట. తెలుగులో చాలా సినిమాలు చేసిన కీర్తి ఇలాంటి పాత్రలు మాత్రం ఎప్పుడూ చేయలేదు. అంతేకాదు అక్క అనే వెబ్ సిరీస్ చేస్తున్న కీర్తి అందులో ఏకంగా రాధికా ఆప్టేతో కలిసి గ్లామర్ షో చేయడానికి రెడీ అయిందట.













