Keerthy Suresh: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో రానున్న కీర్తి
టాలీవుడ్, కోలీవుడ్ లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్(keerthy suresh) తన ప్రియుడుని పెళ్లి చేసుకుని ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. దీంతో ఆ గ్యాప్ ను పూరించాలని కీర్తి పూనుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే తాను నటిస్తున్న సినిమాలన్నింటినీ వరుస పెట్టి రిలీజ్‌లకు రెడీ చేస్తోంది కీర్తి. ప్రస్తుతం కీర్తి చేతిలో పలు సినిమాలున్నాయి.
వాటిలో మొదటిగా సుహాస్(suhaas) తో చేసిన ఉప్పు కప్పురంబు(Uppu kappurambu) అనే సినిమా జులై 4న రిలీజ్ కానుంది. కాకపోతే ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానుంది. దీని తర్వాత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ సినిమా రివాల్వర్ రీటా(revolver rita) రాబోతుంది. ఆగస్ట్ 27న ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు రీసెంట్ గానే మేకర్స్ అనౌన్స్ చేశారు.
వీటితో పాటూ కీర్తి లీడ్ రోల్ లో చేసిన అక్క(Akka) అనే వెబ్ సిరీస్ కూడా రాబోతుంది. ఇవి కాకుండా కీర్తి కన్నివీడి అనే సినిమా చేస్తుంది. దాంతో పాటూ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తో రౌడీ జనార్థన(Rowdy janardhana), వేణు యెల్దండి(venu yeldhandi) నితిన్(nithin) తో చేసే ఎల్లమ్మ(Yellamma)లో కూడా కీర్తి నటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి గత కొంత కాలంగా వచ్చిన గ్యాప్ ను పూరించాలని కీర్తి గట్టి ప్రయత్నాలే చేస్తోంది.






