పెళ్లి వార్తలపై కీర్తి క్లారిటీ
వెండితెరపై ఎక్కువగా ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేసే కీర్తి సురేష్ రియల్ లైఫ్ లో కూడా ట్రెడిషనల్‌గా ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతుంది. అందుకే ఆమెపై పెద్దగా ఎఫైర్స్, రూమర్లు రావు. ఫలానా వారితో డేటింగ్ చేస్తుందనో, ఫలానా వారితో లవ్‌లో ఉందనో ఇప్పటి వరకు కీర్తిపై వార్తలొచ్చిన దాఖలాలు లేవు. కానీ ఆమె పెళ్లి విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు వార్తలొస్తూనే ఉన్నాయి.
కీర్తి కెరీర్ స్టార్టింగ్ లో తమిళ నటుడు, కమెడియన్ సతీష్‌ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో కీర్తి పెళ్లి జరగబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ వీటన్నింటినీ కీర్తి అస్సలు పట్టించుకోలేదు. దీంతో ఆ వార్తలు కొన్నాళ్లకు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఇంత గ్యాప్ తర్వాత కీర్తి పెళ్లి గురించి రూమర్లు స్టార్ట్ అయ్యాయి.
కీర్తి లైఫ్ లో ఇప్పటికే ఓ మిస్టరీ బిజినెస్ మ్యాన్ ఉన్నాడని, ఇద్దరి కుటుంబాల అంగీకారంతో తనని కీర్తి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు ఆ వ్యక్తితో కలిసి ఉన్న ఫోటోను కూడా నెట్టింట వైరల్ చేశారు ఈ రూమర్ రాయుళ్లు. దీంతో కీర్తి ఈ విషయమై వెంటనే స్పందించి, ఆ వ్యక్తి తన ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చింది.
“హహహ.. ఎప్పటిలా కాకుండా ఈ సారి నా బెస్ట్ ఫ్రెండ్ ని నా పెళ్లి వార్తల్లోకి లాగారా? నిజంగా నా లైఫ్ లోకి మిస్టరీ మ్యాన్ వచ్చినప్పుడు సరైన టైమ్ చూసి నేనే పరిచయం చేస్తా. ఒక్కసారైనా నా పెళ్లి గురించి సరైన న్యూస్ రాలేదంటూ” కీర్తి పేర్కొంది. రీసెంట్గా దసరాతో మంచి హిట్ అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది.













