కీర్తి కి మళ్లీ అలాంటి సినిమా పడాల్సిందే
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మలయాళ భామ కీర్తి సురేష్ మొదటి సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటూ తమిళ సినిమాల్లో కూడా నటించి స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. అమ్మడు నటించిన మహానటి సినిమా కీర్తి రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. మహానటిలో కీర్తి యాక్టింగ్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
దీంతో మహానటి తర్వాత కీర్తి మరిన్ని ప్రయోగాలు చేయాలనుకుంది. కానీ దానికి తగ్గట్టు ఆమెకు ఆఫర్లు రాలేదు. కమర్షియల్ సినిమాలు చేస్తూ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వచ్చిన కీర్తికి అవేమీ మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. గతేడాది దసరాతో తన మార్క్ హిట్ ను అందుకున్న కీర్తి చేతిలో ప్రస్తుతం మూడు తమిళ సినిమాలున్నాయి.
అయితే కీర్తికి భోళా శంకర్ తర్వాత తెలుగు నుంచి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ ఆఫర్లు వస్తుండటంతో కోలీవుడ్ మీదే దృష్టి పెట్టాలని కీర్తి డిసైడైంది. అయితే కీర్తి తిరిగి తెలుగులో మునుపటి క్రేజ్ ను సంపాదించాలంటే మహానటి లాంటి సినిమా మరోటి పడాలని, అప్పుడే కీర్తి టాలెంట్ ఏంటన్నది అందరికీ తెలిసిరాదని సినీ విశ్లేషకులంటున్నారు. ఇదిలా ఉంటే కీర్తి రీసెంట్ గానే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో బీ టౌన్ ను కూడా ఏలాలని భావిస్తున్న కీర్తికి అక్కడ ఎలాంటి సినిమాలు పడతాయో చూడాలి.













