కీర్తి త్వరలోనే గుడ్ న్యూస్!
మహానటి సినిమాతో నేటి తరం సావిత్రిగా విశేష ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డుని కైవసం చేసుకున్న కీర్తి సురేష్ త్వరలోనే ఓ శుభవార్తని చెప్పబోతున్నారట. ప్రస్తుతం రజనీకాంత్ అన్నాతై, నితిన్‌తో రంగ్ దే, మహిళా ప్రధానంగా సాగే మిస్ ఇండియా చిత్రాల్లో కీర్తి నటిస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు దేశ వ్యాప్తంగా ప్రకటించిన లాక్డౌన్ కారణంగా ఈ సినిమాల షూటింగ్‌లు ఆగిపోయాయి. ఇదిలా ఉంటే, త్వరలోనే కీర్తి పెళ్లి వార్త చెప్పే అవకాశం ఉందని సోషల్ మీడియా ఓ వార్త వైరల్ అయ్యింది. రాజకీయ నేపథ్యంలో ఓ వ్యాపార దిగ్గజంతో కీర్తి పెళ్ళికి ఆమె కుటుంబం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిదట. ఆ వరుడు కూడా కీర్తి కుటుంబానికి అత్యంత సన్నిహితుడట. మొత్తమీద ఈ ఏడాదిలోనే కీర్తి పెళ్ళి ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే పెళ్ళి తర్వాత కీర్తి మనుపటిలాగానే సినిమాల్లో నటిస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.













