ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు : కీర్తీ
కీర్తి సురేష్ పెళ్లి కూతురు కాబోతోంది. మహానటి ఇల్లాలు కాబోతోంది అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కేరళకి సంబంధించిన బిజినెస్‌మేన్‌ని కీర్తి వివాహం చేసుకోబోతున్నారన్నది ఆ వార్తల సారాంశం. ఈ విషయమై నటి, కీర్తీ సురేష్ తల్లి మేనకను సంప్రదించగా పెళ్లి వార్తలు ఉట్టి పుకార్లు అని సృష్టం చేశారు. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని కీర్తీ సురేష్ కూడా కొట్టిపారేశారు. పెళ్లి వార్త గురించి స్పందిస్తూ ఈ వార్తలు విని నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో అర్థం కాదు. ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం మనందరం దృష్టి పెట్టాల్సిన విషయం కరోనా వైరస్. దానిపై పోరాటం చేద్దాం. ఇలాంటి అసత్యపు వార్తల్ని (పెళ్లి వార్తలు) ప్రచారం చేయొద్దు అని పేర్కొన్నారు కీర్తీ సురేష్.













