Kayadhu Lohar: దీపావళి గ్లో తో మెరిసిపోతున్న కయాదు

దీపావళి సందర్భంగా సోషల్ మీడియా మొత్తం కళకళలాడుతుంది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఎంతో అందంగా ముస్తాబై దీపావళిని సెలబ్రేట్ చేసుకుని వాటికి సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు. హీరోయిన్లు కూడా దీపావళి సందర్భంగా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా, కయాదు లోహర్(kayadhu lohar) కూడా అలానే తన తాజా ఫోటోషూట్ ను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో కయాదు రెడ్ కలర్ లెహంగా ధరించి దీపావళి గ్లో తో మరింత స్పెషల్ గా కనిపించగా, ఆ ఫోటోలను నెటిజన్లు వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.