అక్షయ్ కు జోడీగా కత్రినా ?
కేసరి విజయంతో జోరుమీదున్నాడు అక్షయ్‌కుమార్. సింబా తర్వాత రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం సూర్యవంశీ. ఇందులో అక్షయ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఆ గెటప్‌లో విడుదల చేసిన అక్షయ్ ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. మరి ఈ చిత్రంలో అక్షయ్‌కు జోడీగా ఎవరు నటిస్తారంటే.. కత్రినాకైఫ్ పేరు దాదాపుగా ఖాయమైంది అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. రోహిత్ తన చిత్రంలో కథానాయికగా పలువుర్ని అనుకన్నా అక్షయ్, కత్రినా పేరుని సూచించడంతో అంగీకరించినట్లు సమాచారం. ఈ ఇద్దరు కలిసి నటిచిన చివరి చిత్రం తీస్ మార్ ఖాన్ 2010లో విడుదలైంది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ జోడీ కుదిరింది. కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ భారత్ లో నటిస్తోంది. అక్షయ్ హౌస్‌పుల్ 4, గుడ్ న్యూస్, మిషన్ మంగళ్ చిత్రాల్లో నటిస్తున్నాడు.













