Karthi: కార్తీ లైనప్ మొత్తం సీక్వెల్సే
ఇండియన్ సినిమాలో ఇప్పుడెన్నో సీక్వెల్స్ రానున్నాయి. వాటిలో కొన్ని సెట్స్ పై ఉండగా, మరికొన్ని సీక్వెల్స్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నాయి అయితే ఈ సీక్వెల్స్ లో ఎక్కువ సీక్వెల్స్ మాత్రం కోలీవుడ్ హీరో కార్తీ(Karthi) అకౌంట్ లోనే ఉన్నాయి. కార్తీకి కోలీవుడ్ తో పాటూ టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం కార్తీ పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
కార్తీ చేతిలో పలు సినిమాలుండగా, వాటలో ఎక్కువ సినిమాలు సీక్వెల్సే అవడం విశేషం. ప్రస్తుతం కార్తీ సర్దార్ సినిమాకు సీక్వెల్ గా సర్దార్2(Sardar2) చేస్తున్నాడు. దాని తర్వాత కార్తీ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఖైదీ(Khaidhi) సీక్వెల్ గా ఖైదీ2(Khaidhi2)ను చేయనున్నాడు. ఈ రెండు సినిమాలపై అందరికీ విపరీతమైన అంచనాలున్నాయన్నది అందరికీ తెలుసు.
వాటితో పాటూ ఇప్పుడు ఖాకీ(Khaakhee)కి కూడా సీక్వెల్ రానుందని కార్తీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. యుగానికి ఒక్కడు(Yuganiki Okkadu) సీక్వెలలో కూడా కార్తీ నటించే ఛాన్సుందంటున్నారు. కంగువ2(Kanguva2) వస్తే అందులో కూడా కార్తీ కీలక పాత్ర చేయనున్నాడు. కానీ కంగువ(Kanguva) డిజాస్టర్ అయిన నేపథ్యంలో కంగువ2 వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి కాక రీసెంట్ గానే హిట్3(Hit3) క్లైమాక్స్‌లో మెరిసి హిట్4(Hit4) తానే చేయబోతున్నాడని హింట్ ఇచ్చాడు కార్తీ. మొత్తానికి ప్రస్తుతం ఎక్కువ సీక్వెల్స్ చేస్తున్న హీరోగా కార్తీ ఫేమస్ అయ్యాడు.






